బర్రెలక్క ఇనస్ప్రెషన్‌తో ఓ పాటను కూడా రాసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ పాట కూడా దుమ్ము రేపుతోంది. బర్రెలక్క ధైర్యం చూడరా.. పాలకులకు బుద్ధి చెప్పరా అంటూ సాగిన పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరోవైపు కొల్హాపూర్ అభ్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఫ్రీ పబ్లిసిటీతోపాటు, యువత ఆలోచనలో పడడంతో ఓటర్లు ఎన్నికల నాటికి ఏం చేస్తారో అని ఆందోళన చెందుతున్నారు.
శిరీష కొల్హాపూర్ అభ్యర్థుల గెలుపు ఓటములను మార్చుడం ఖయం అని విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇక శీరిష తండ్రి చిన్నప్పుడే వదిలేసి పోయాడు. దీంతో తల్లి తన ముగ్గురు ఆడపిల్లలను పోషిస్తోంది. చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి శిరీష చిన్న వీడియో పెట్టినందుకు పోలీసులు కేసు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొల్హాపూర్ బరిలో ఉన్న శిరీషకు ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించింది. ఇప్పుడు ఈ విజిల్ సౌండ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీటల అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది.
బీఆర్‌ఎస్ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులు లక్షల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తుంటే.. బర్రెలక్కకు మాత్రం ఫ్రీగా పబ్లిసిటీ వస్తోంది. సోషల్ మీడియాలో శిరీష పోస్టు చేస్తున్నవీడియోలకు నిత్యం వేల వ్యూస్ వస్తున్నాయి. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాల్లో వారిని పలకరించిన వారే లేరు. వీరికి వెయ్యి వ్యూస్ కూడా రావడం లేదు.