బర్రెలక్క అలియాస్ శిరీష కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒక మామూలు గ్రామానికి చెందిన యువతీ. పేద కుటుంబం.. హైదరాబాదులో చదువుకుంటున్నది. తాను ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య మీద, తన ఊరికి సరైన బస్సు లేకపోవడంతో పడుతున్న ఇబ్బంది మీద తీసిన చిన్న వీడియోలు ఆమెను సోషల్ మీడియా స్టార్ ను చేశాయి. కానీ ఇక్కడే తనకు వచ్చిన పాపులారిటీని ఆమె అత్యంత తెలివిగా వాడుకుంది. బిత్తిరి సత్తి లాగా, సావిత్రి లాగా పెయిడ్ షోలు చేయకుండా.. న్యూట్రల్ గా ఎదిగింది.
తనకు వచ్చిన ఆ పాపులారిటీని మంచికి ఉపయోగించుకోవాలని ఉంది. అందులో భాగంగానే కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తన తమ్ముడితో కలిసి నామినేషన్ దాఖలు చేసింది. మొదట్లో తను నామినేషన్ వేసిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆమె దీన్ని తనకు బూస్టర్ లాగా వాడుకుంది. అడుగు అడుగు కూడ తీసుకొని ప్రచారానికి దరఖాస్తు చేసుకుంటే.. అక్కడ కూడా ఆమెకు ఆశించినంత స్థాయిలో అధికారుల నుంచి ప్రోత్సాహం దక్కలేదు.
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలియడంతో ఆమెకు మద్దతు విపరీతంగా లభించడం ప్రారంభమైంది. ఏముంది రాత్రికి రాత్రే ఆమె మీడియా స్టార్ కూడా అయిపోయింది. యూ ట్యూబర్లు ఆమెను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. ఆ యువతి కూడా ఎటువంటి సంకోషం లేకుండా వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభించింది. ఇక పెద్దపెద్ద వారు కూడా ఆమెకు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఆమె కొల్లాపూర్ లో ఒక సెలబ్రిటీ లాగా మారిపోయింది.