అయోధ్యలో అద్భుత దృశ్యం. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం.

సూర్య కిరణాలు బాలరాముడి నుదుటిపై పడే విధంగా ఆలయ నిర్మాణం జరిగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సూర్య కిరణాలు సుమారు 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటన తిలకంగా ప్రసరించాయి. అయితే దేశవ్యాప్తంగా రామనవమి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఈసారి రామనవమికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత రాంలాలాకు ఇది మొదటి రామనవమి.

ఈ సందర్భంగా రాంలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకంగా ఆ సూర్యభగవానుడే.. రాంలాలాకు అభిషేకం చేశాడు..ఆ పూర్వ ఘట్టాన్ని యావ్‌ దేశం కన్నులారా తిలకించి పులకించిపోయింది. ఆలయ నిర్మాణంలో భాగంగా అద్బుతమైన టెక్నాలజీ సాయంతో రూపొందించిన శాస్త్రవేత్తల కృషి ఫలించింది.

సూర్య తిలకం రామ్‌లల్లా నుదుటిని ముద్దాడిన ఆ క్షణాన్ని యావత్‌ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసింది. శ్రీరామనవి నాడు సరిగ్గా 12 గంటల సమయంలో సూర్యకిరణాలు రాంలాలా నుదుటిపై పడటంతో ఆయనకు సూర్యాభిషేకం జరిగింది. రామాలయంలో జరుగుతున్న రామనవమి ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారం కూడా జరిగింది. రామనవమి సందర్భంగా రామమందిరానికి ప్రత్యేక అలంకరణ చేశారు.

రామ నవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున 3.30 గంటలకు రామాలయం తలుపులు తెరిచారు. రాత్రి 11 గంటల వరకు భక్తులు రాంలాల దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది ఆలయ ట్రస్ట్. ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *