పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నార్సింగి పోలీసులు చందూ సాయిని శుక్రవారం అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన ఓ యువతికి యూట్యూబర్ చందుసాయి తాను ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు. అలా 2021 ఏప్రిల్ 25న తన పుట్టిన రోజు వేడుకలకు ఆమెను ఆహ్వానించాడు. అదే రోజు తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అయితే ప్రముఖ యూట్యూబర్ చంద్ర శేఖర్ సాయి(పక్కింటి కుర్రాడు)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తనపై అత్యాచారం చేసి, మోసం చేశాడని అతనిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చందూ గాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్స్‌లో వీడియోలు చేశాడు చంద్ర శేఖర్ సాయి అలియాస్ చందూ సాయి. కొన్ని సినిమాల్లోనూ నటించాడు. పక్కింటి కుర్రాడు (పీకే)గా చందు సాయి చేసే వీడియోలు యూట్యూబ్ లో చాలా పాపులర్ . ఈ వీడియోలకి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి.
పక్కింటి కుర్రాడు పేరుతో అతి తక్కువకాలంలో సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన చందుసాయి.. గత కొన్నాళ్లుగా యూట్యూబ్‌లో కనిపించడం మానేశాడు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. . తనను ఎవరైతే పాపులర్ చేశారో.. వాళ్లతో వచ్చిన చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అక్కడ నుంచి బయటకు వచ్చేసినట్టు చెప్పారు.