గత కొంతకాలంగా జనసేన పార్టీలో మహిళా విభాగం తరఫున అత్యంత బలంగా వినిపిస్తోన్న వాయిస్ రాయపాటి అరుణదే. రాజకీయ ప్రత్యర్థులు జనసేన పార్టీ మీద చేసే విమర్శల్ని తిప్పి కొట్టడంలో, రాయపాటి అరుణ రూటే సెపరేటు.
ఈ క్రమంలో ఆమె అధికార పార్టీ నుంచి కొన్ని బెదిరింపులు కూడా ఎదుర్కొంటున్నారు. మొన్నీమధ్యనే రాయపాటి అరుణకు బెదిరింపులు వస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి, అధికార పార్టీకి వార్నింగ్ ఇవ్వడంతో, రాయపాటి అరుణకి క్షమాపణలు కూడా చెప్పారు వైసీపీ నేతలు.
మాటల్లో స్పష్టత, విమర్శల్లో స్పష్టత.. అన్నిటికీ మించి ఎవరికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో ఆ భాషలో చెప్పడం రాయపాటి అరుణ ప్రత్యేకత.