అదృష్టం అంటే ఇతనిదే, 10 రూపాయలతో రాత్రికి రాత్రి కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్.

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేం. లక్‌ ఉంటే కటిక పేదవాడు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడు. తాజాగా అదే జరిగింది. పది రూపాయలు ఓ ఆటో డ్రైవర్‌ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రి కోటీశ్వరుడ్ని చేసేసింది. అతని పేరు నాజర్.. అతను తన భార్య పిల్లలతో కలిసి కేరళలో ఉండే కన్నూర్ లోని అలకోడేలో నివసిస్తూ ఉంటాడు. ఇతను ఒక సాధారణ ఆటో డ్రైవర్. తానొక్కడే కష్టపడుతూ పిల్లల్ని చదివించుకుంటున్నాడు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం.. రూపాయి రూపాయి కూడబెడుతూ..

రాత్రి పగలు కష్టపడుతూ ఆటోను నడుపుతున్నాడు. ఇతని కష్టం వాసన దేవుడి వరకు చేరిందో ఏమో కానీ, లాటరీ రూపంలో ఇతనికి లక్ కలిసి వచ్చింది. ఓ రోజు నాజర్ 10 రూపాయల పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. గెలిస్తే 10 కోట్లు వస్తాయి.. పోతే పది రూపాయలు పోతాయి అనుకున్నాడు నాజర్. ఇంతలో కొన్ని రోజుల తర్వాత లాటరీ తీసే రోజు రానే వచ్చింది. తీరా చూస్తే ఏముంది..లాటరీలో తన తీసుకున్న టికెట్ నెంబర్ ఏ వచ్చింది.

దీనితో నాజర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అదృష్టంగా వచ్చిన ఆనందాన్ని పట్టలేకపోయాడు. అప్పటివరకు జీవితంలో ఎన్నో కష్ఠాలను చవి చూసిన అతనికి.. కేవలం పది రూపాయలు పెట్టుబడితో పది కోట్లు రావడంతో.. అతని కుటుంబం ఎంతో సంతోషిస్తుంది. ఇప్పుడు వచ్చిన డబ్బుతో.. తనకంటూ ఒక ఇళ్ళు.. తన పిల్లలకు మంచి చదువును అందించాలని భావిస్తున్నాడట నాజర్. అప్పటివరకు అతనిని చిన్న చూపు చూస్తూ.. అప్పు అడిగినపుడు ఇవ్వని వారు కూడా..

ఇప్పుడు అతనినే అప్పు అడుగుతున్నారట. డబ్బు ఉంటేనే సమాజంలో మర్యాద, గౌరవం ఉంటాయని .. అలాగే డబ్బుతో సంబంధం లేకుండా.. నీతిగా నిజాయితీగా ఎవరైనా కష్టపడితే. వారికీ తగిన ఫలితాలు .. సరైన టైమ్ లో దేవుడు అందిస్తాడని.. నాజర్ జీవితంలో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *