గజ్జి, తామర వంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా గజ్జల్లో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే వీటిని తగ్గించుకునేందుకు క్రీములు గట్రా వాడాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే గజ్జి, తామర, ఇతర ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను సులభంగా తగ్గించుకోవచ్చు. కొబ్బరినూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. వాటికి కారణం అయ్యే సూక్ష్మ క్రిములను కొబ్బరినూనె నాశనం చేస్తుంది.
దీంతోపాటు చర్మాన్ని సంరక్షిస్తుంది. కొద్దిగా కొబ్బరినూనెను తీసుకుని వేడి చేయాలి. అనంతరం దాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. దీంతో ఎలాంటి చర్మ సమస్య అయినా సరే తగ్గిపోతుంది. పసుపు ద్వారా మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. సూక్ష్మ క్రిములు వృద్ధి చెందకుండా చూస్తాయి.
కొద్దిగా పసుపును తీసుకుని గోరు వెచ్చని నీటితో కలిపి పేస్ట్‌లా చేయాలి. అనంతరం దాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. తరువాత కొంత సేపటికి అది తడి ఆరిపోతుంది. దాన్ని 3 గంటల పాటు అలాగే ఉంచి తరువాత కడిగేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేయాలి. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. అలాగే నీటిలో కొద్దిగా పసుపు వేసి మరిగించి కూడా తాగవచ్చు. దీంతో ఫలితం ఇంకా మెరుగ్గా వస్తుంది.
కలబంద గుజ్జులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి గజ్జి, తామరతోపాటు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని సమస్య ఉన్న చోట రాయాలి. ఒక గంట సేపు అయ్యాక కడిగేయాలి. రోజుకు 3 సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.