విశాఖ శారదా పీఠం లో శ్రీ రాజశ్యామల యాగం వైభవోపేతంగా జరిగింది . బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయం జ్యోతి మండపం లో రాజ శ్యామల అమ్మవారి యాగం లో పాల్గొన్న సీఎం జగన్ తో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి పూర్ణాహుతి జరిపించారు.
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు పాల్గొన్నారు. తాడేపల్లి నుండి విశాఖపట్టణం చేరుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం నుంచి నేరుగా శారదా పీఠం చేరుకున్నారు. మన్యుసుక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని సంకల్పం చెప్పుకొన్నారు.
తొలుత మహాస్వామిని దర్శించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనంతరం రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో రాజ్యశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో పాల్గొన్న సీఎం జగన్ సాంప్రదాయ దుస్తుల్లో అక్కడి దేవతామూర్తులను దర్శించుకొని, యాగంలో పాల్గొన్నారు.