సితారకు పోటీగా రంగంలోకి దిగిన అక్క భారతి, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో.

సితార..కేవలం మహేష్ బాబు కూతురిగా కాకుండా తనకు ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది. సితార ఓ జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆమె నటించిన యాడ్ న్యూ యార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో ప్రదర్శించారు. ఈ యాడ్ కి సితార కోటి రూపాయలు ఛార్జ్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు సితార కు పోటీగా మరో ఘట్టమనేని వారసురాలు తయారైంది. మహేష్ బాబు అన్న కూతురు భారతి ఘట్టమనేని సోషల్ మీడియా లేటెస్ట్ సెన్సేషన్ గా మారింది.

సూపర్ స్టార్ కృష్ణ కు ఇద్దరు కుమారులు.పెద్దబ్బాయి రమేష్ బాబు అనారోగ్యంతో మరణించారు. రమేష్ బాబుకు ఇద్దరు సంతానం. ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అమ్మాయి పేరు భారతి. తాజాగా గుంటూరు కారం చిత్రం లోని కుర్చీ మడతపెట్టి పాటకు భారతి స్టెప్స్ వేసింది. మాస్ మూమెంట్స్ డాన్స్ ఇరగదీసింది.

ప్రొఫెషనల్ డాన్సర్ ని తలపించేలా హుక్ స్టెప్స్ వేసింది. వీడియో చూసిన వారు సితారకు గట్టి పోటీ ఇస్తుంది భారతి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సితారకు నటన పట్ల ఆసక్తి ఉన్నట్లు స్పష్టం చేసింది. భవిష్యత్తులో సినీ ఎంట్రీ ఇవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ద్వారా సితార భారీగా సంపాదిస్తుందని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *