దర్శన్, పవిత్ర గౌడ ప్రేమలో ఉన్నారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మళ్లీ ఈ స్టార్ హీరో దర్శన్, పవిత్ర గౌడ సంబంధం తెరపైకి వచ్చింది. ఎందుకంటే పవిత్ర గౌడ దర్శన్ తో కలిసి తాను తీయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితేఇక అసలు విషయం ఏంటంటే! శాండిల్ వుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో అయిన దర్శన్.. తన సినిమాలతో.. తన కాంట్రో కామెంట్స్‌తో.. తన భార్యతో హ్యాపీగా తన లైఫ్ తాను లీడ్ చేస్తున్నారు. రీసెంట్‌గా కాటేరా సినిమాతో.. కన్నడ ఇండస్ట్రీలో రికార్డ్ విక్టరీ కొట్టారు.
ఇక ఈక్రమంలోనే కన్నడ హీరోయిన్ పవిత్రా గౌడ.. తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. దర్శన్, పవిత్ర గౌడ కాస్త ప్రైవేట్‌గా కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి. అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి. వీళ్ల మధ్య ఏదో రిలేషన్ ఉందనే టాక్‌ను నిజం చేసేశాయి. దాంతో పాటే ’10 ఏళ‍్ల రిలేషన్‌షిప్ ఇది. ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక‍్యూ దర్శన్’ అంటూ ఆ వీడియో కింద ఈమె ఇచ్చిన క్యాప్షన్ కూడా.. అందర్నీ షేక్ చేసింది.
వీరిద్దరి గురించి అందరూ బహిరంగంగానే మాట్లాడుకునేట్టు చేసింది. అయితే ఆ మాటలు కాస్తా.. దర్శన్ భార్య విజయలక్ష్మి చెవిన పడడంతో.. ఒక్క సారిగా ఈమె మండిపడ్డారట. నేరుగా పవిత్ర గౌడ ఉన్న షూటింగ్ లొకేషన్‌లోకి వెళ్లి.. వార్నింగ్ ఇచ్చారట. తన భార్తకు దూరంగా ఉండాలంటూ.. ఇచ్చిపడేశారట. ఇక ఈ మ్యాటర్ ఆనోటా ఈనోటా పడి.. ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ ట్రైయాంగిల్ ప్రేమ కథ గురించి అందరూ మాట్లాడునేలా చేసింది. ట్రోల్స్ మీమ్స్ కు వీళ్ల స్టోరీ ఫీడై పోయింది.