సూపర్ స్టార్‌కు సంబంధించిన లేటేస్ట్ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ట్రెడ్ మిల్ పై మహేష్ జెట్ స్పీడ్‌లో రన్ చేస్తున్నాడు. 47 వయసుల్లోనూ మహేష్ అంత స్పీడ్ గా అగ్రెసివ్ గా పరిగెత్తడం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
ప్రస్తుతం మహేష్ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఎస్ఎస్ఎంబీ 28 చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలోనూ నటించనున్నారు. అయితే మహేష్ ఇలా హ్యాండ్సమ్ గా కనిపించడానికి చాలా కఠిన శిక్షణే ఉంది.
జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తూ బాడీ ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ.. యంగ్ లుక్ లో దర్శనమిస్తున్నారు. కాగా జిమ్ లో వర్క్ అవుట్స్ చేసే ఫోటోలను, వీడియోలను మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు.