ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పాపులర్ అయ్యాడు వేణు స్వామి. ఆయన చెప్పింది దాదాపు నిజం అవుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన జ్యోతిష్యం చెప్పాడు. కొత్త ఏడాది ఎలా ఉండబోతుంది, చిత్రపరిశ్రమలో చోటు చేసుకునే పరిణామాలను ఆయన వెల్లడించారు. ఇందులో షాకింగ్ విషయాలను వేణుస్వామి పంచుకున్నారు.
అయితే ఈ ఏడాది ఎవరెవరు విడిపోతున్నారు అనేది కూడా బయటపెట్టారు. ఈ ఏడాది ఇద్దరు టాప్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా గతంలోనే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడాకులు అవుతాయని స్పష్టం చేశారట.ఇక రీసెంట్ గా పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉన్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు కూడా ఒక మహిళ కారణంగా విడాకులు తీసుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్న లెజ్నోవా కి విడాకులు ఇస్తారని, విడాకులు ఇచ్చి నాలుగో పెళ్లి చేసుకుంటారంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రభాస్ కి పెళ్లి జరిగితే ఈ ఏడాది లోనే జరగాలి.ఒకవేళ జరిగినా కూడా ఈయనకు కచ్చితంగా విడాకులు తప్పవు. ఈయన కి ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా పెళ్లి జరగదు. బ్రహ్మచారిగా మిగిలిపోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు.