ఎంత యాక్టివ్ గా ఉండే సమంత ఫిట్‌నెస్ రహస్యం ఇదే.

సామ్… సినిమాల్లో కి వచ్చిన మొదట్లో సమంత ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు అంతకు మించి అందంతో ఆకట్టుకుంటున్నారు. ఆమెకు ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా అనే చెప్పాలి. ఫిట్‌నెస్ కాపాడుకోవడం కత్తిమీద‌సామే.. సినీ రంగంలో హీరోయిన్‌గా రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరాకృతి, ప్రకాశవంతమైన చర్మాన్ని మెయిన్ టెయిన్ చేయాలి. అయితే అది అనుకున్నంత సులువు కాదు. కఠినమైన వర్కౌట్స్ చేస్తూ ఫిట్‌నెస్‌ను నిరంతరం కాపాడుకోవాలి.

ఈ విషయంలో సమంత ముందుచూపుతో వ్యవహరిస్తోంది. వివిధ రకాల ఫిట్‌నెస్ యాక్టివిటీస్ చేస్తూనే హెల్త్ డ్రింక్స్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా తన ఫిట్‌నెస్‌కు కారణమైన ‘గ్రీన్ స్మూతీ రెసిపీ’ని ఇటీవల అభిమానులతో షేర్ చేసుకుంది. * కావాల్సిన పదార్థాలు.. గ్రీన్ స్మూతీ రెసిపీకి కావల్సిన పదార్థాలు ఇలా.. కాలే (ఆకు క్యాబేజీ), పాలకూర (ఒక టేబుల్ స్పూన్), అవిసె గింజలు (రెండు టేబుల్ స్పూన్లు), పొద్దుతిరుగుడు విత్తనాలు (ఒక టేబుల్ స్పూన్), బాదం (ఒక టీస్పూన్), చియా గింజలు (ఒక టీస్పూన్), తగినంత నీరు అవసరం.

తయారీ విధానం :- మందుగా కాలే, పాలకూరను శుభ్రంగా కడగాలి. ఆ తరువాత కొన్ని నిమిషాల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, చియా గింజలు, బాదంపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని నీటిలో పదినిమిషాలు నానబెట్టాలి. ఆ తరువాత నానబెట్టిన కాలే, పాలకూరును, గింజలను మిశ్రమంగా చేయడానికి మిక్స్ పట్టాలి. రుచికోసం అందులోకి తగినంత నీరు, అరటి గుజ్జు వేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *