టాలీవుడ్ స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు, మెహన్ బాబుకు కుమార్తె మంచు లక్ష్మి, నాగాబాబు కుమార్తె నిహారిక, మరియు రాజశేకర్ ఇద్దరు కూతుళ్లు సినిమాలతోనూ మీడియాలోనూ పాపులర్ అయ్యారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణం రాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు వారి పేర్లు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి కాగా వాళ్లు ముగ్గురూ ప్రస్తుతం చదువులతో బిజీగా ఉన్నారు.
ఒకప్పుడు హీరోగా అదరగొట్టి ఇప్పుడు విలన్ గా బయపెడుతున్న జగపతిబాబుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు మేఘనబాబుకు ఇప్పటికీ వీదేశీయుడితో వివాహం జరిగింది. మరో కూతురు ఉన్నత చదువులు చదువుతోంది. విక్టరీ వెంకటేష్ కు కూడా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి ముగ్గురు పేర్లు హైమావతి, భావన, అశ్రిత కాగా పెద్ద కూతురు అశ్రిత వివాహం కూడా జరిగింది. అంతే కాకుండా ఆమె ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు.
మాస్ మహరాజ్ రవితేజకు ఇద్దరు ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు. రవితేజ కుమారుడు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుండగా కుమార్తె కల్యాణి తేజ చదువుకుంటోంది. హీరో శ్రీకాంత్ కు ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. హీరో రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక కుమార్తె కూడా హీరోయిన్ రేంజ్ లో ఉండగా ప్రస్తుతం చదువులతో బిజీగా ఉంది.