తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా… బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో మార్పు రాలేదన్నారు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలంతా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని చెప్పారు. ప్రజా తీర్పును గౌరవించకపోతే… బయటికే పంపుతారని అన్నారు. అయితే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే… ప్రగతి భవన్ బయట ఏర్పాటు చేసిన ముళ్ల కంచెను బద్దలు కొట్టామన్నారు.
అలాంటి పరిపాలన వద్దనుకొనే.. తెలంగాణను సాధించుకున్నామన్నారు. మళ్లీ గత ప్రభుత్వ పాలకులు చేపట్టిన వాటిని వెట్టిచాకిరినే మనం కొనసాగించకూడదన్నారు. తనకు అన్ని సభలలో తనకు అనుభవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో జరిగిన తప్పును మేము సరిదిద్దాము.. అందుకే గతంలో ప్రగతి భవన్ ముందు ఉంచిన ముల్లె కంచెను తొలగించామని తెలిపారు. పాలనపరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అనుకున్న వారు ఎవరైనా వచ్చి సలహాలు ఇవ్వండి అని కోరారు.
ప్రజా భవన్‌గా ప్రగతి భవన్‌ను మార్చామన్నారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. మార్పు తెస్తామని.. మార్పును చూపించామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బీమాలు చూస్తే అర్థం అవుతుంది… ఎంత మంది యువ రైతులు చనిపోయారో అర్థం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో కల్పించుకుని మండలి చైర్మన్ గుత్తా క్లారిటీ ఇచ్చారు.