శిరీష ది పేదరికమైన కుటుంబం. ఓపెన్ డిగ్రీ పూర్తి చేసింది. బీఈడీలో సీటు రావడంతో త్వరలో చేరేందుకు రెడీ అవుతోంది. ఆ మధ్య తాను చేసిన బర్రెల వీడియోతో కోర్టు కేసులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆ బర్రెలు కూడా అమ్మేసినట్టుంది.. అయితే ఇప్పుడు ఎన్నికలు రావడంతో అనూహ్యంగా నామినేషన్ వేసింది.
బర్రెల వీడియోతో పాపులర్ అయిన శిరీష ను నామినేషన్ వేసిన అనంతరం నెత్తిన పెట్టుకుంది. ఆమె మాట్లాడిన తీరు కూడా ఆకట్టుకుంటున్నది. ఆమె కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో గెలుస్తుందా? ఎమ్మెల్యే అయి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందా? ఆమెకు ఉన్న రాజకీయ అనుభవం ఎంత? ఆమె ఎంతవరకు చదువుకుంది? ఇన్ని ప్రశ్నలకు పెద్దగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ప్రస్తుత అధికార పార్టీ క్యాబినెట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యార్హత ఎంత? మల్లారెడ్డి విద్యార్హతపై ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఏం చదువుకున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి.. ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి.. నేరుగా మన వ్యవస్థను ప్రశ్నిస్తోంది అంటే శిరీష రూపంలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన లేత కలలు, ప్రశ్నించే గొంతుకలు ఇంకా భద్రంగానే ఉన్నట్టు కదా!