జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రానున్న ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం భర్త సీఎం కావడంతో.. ఆమె కేవలంకుటుంబ వ్యవహారాలతో పాటు వ్యాపారాలను చూసుకుంటున్నారు.
వాటిని విజయవంతంగానే నడుపుతున్నారు. ఆ రెండు బాధ్యతలకే పరిమితమైన ఆమె.. వచ్చే ఎన్నికల ద్వారా రాజకీయ ఎంట్రీకి సిద్ధమయ్యారు అనే వార్త రాజకీయాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆమె రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉందా..?
లేక సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆమెను రాజకీయాల్లోకి దింపుతున్నారు. అసలు ఆ ప్రచారంలో నిజమెంత..?