15 వారాలుగా సాగిన ఈ బిగ్‌బాస్ నిన్న ఆదివారం రాత్రి పూర్తయింది. 14 మందితో మొదలైన బిగ్‌బాస్ కొంతమంది ఎలిమినేట్ అయిన తర్వాత మరో అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు. ఒక్కో వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయగా ఫైనల్ కి ఆరుగురిని మిగిల్చారు. అర్జున్, ప్రియాంక జైన్, యావర్, శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ లు ఫైనల్ కి వెళ్లారు. అయితే మొదట్లో బిగ్ బాస్ విన్నర్ కు వచ్చిన 50 లక్షల ప్రైజ్ మనీ లో 13 లక్షలు టాక్స్ రూపంలో పోగా .. దాదాపు రూ. 37 లక్షలు మిగిలేవి.
కాగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ టాక్స్ తో పాటు జిఎస్టీ కూడా తోడైంది. దీంతో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ లో భారీగా కోత జరుగుతుంది. ఈ విషయాన్ని ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజే సన్నీ కూడా స్పష్టం చేసాడు. 50 లక్షలు గెలుచుకున్నది వాస్తవమే అయినా తన చేతికి వచ్చింది మాత్రం 23 లక్షలే అని చెప్పాడు. అయితే సీజన్ 7 లో ట్విస్ట్ ఏంటంటే .. యావర్ రూ . 15 లక్షలు తీసుకుని రేసు నుండి తప్పుకున్నాడు. ఈ రూ . 15 లక్షలు విన్నర్ కి ఇచ్చే ప్రైజ్ మనీ నుండి కట్ చేస్తారు. ఆ లెక్కన చూసుకుంటే .. మిగిలేది రూ. 35 లక్షలు.

అందులో 46 శాతం టాక్స్ టాక్స్ కట్టింగ్స్ కి పోను మిగిలేది రూ. 16 లక్షలు మాత్రమేనట . బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అని గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలో టైటిల్ గెలిచిన ప్రశాంత్ కి దక్కేది కేవలం రూ. 16 లక్షలేనట. రెమ్యునరేషన్ ప్రతి ఒక్కరికి సెపరేట్ గా ఇస్తారు. తనకు వచ్చిన ప్రైజ్ మనీ ని రైతుల కోసం ఉపయోగిస్తానని ప్రశాంత్ చెప్పాడు. కష్టంలో ఉన్న రైతుని ఆదుకుంటాను. కోట్లాదిమందికి నేను ఆదర్శంగా నిలుస్తానని అని అన్నాడు ప్రశాంత్. ఎంత వచ్చినా మాట ప్రకారం ఆ డబ్బును ప్రశాంత్ పేద రైతులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.