జ్వరం వచ్చినా పొట్టకూటి కోసం ఇలాంటి పనులు తప్పడం లేదు, అసలు విషయం చెప్పిన విష్ణు ప్రియా.

ప్రస్తుతం విష్ణుప్రియ వ్యాయామం, యోగా అంటూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుంది. అంతేకాకుండా నటి రితూ వర్మతో కలిసి వెకేషన్స్ కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈమె సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే విష్ణు ఇప్పుడు బుల్లితెర పై ఎలాంటి షోలు, ఈవెంట్లలో కనిపించడం లేదు. అయితే విష్ణు ప్రియా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

అనారోగ్యానికి గురయ్యాను కానీ పొట్టకూటికోసం తప్పడం లేదు అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది విష్ణు ప్రియా దాంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మేరకు విష్ణు ప్రియా ఇన్ స్టా స్టోరిలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో విష్ణుప్రియ తాను ఒంట్లో బాగోలేదని, జ్వరం వచ్చిందని, జలుబు కూడా చేసిందని చెప్పుకొచ్చింది. జ్వరం వచ్చిన , ఒంట్లో ఓపిక లేకున్నా పొట్టకూటికోసం తప్పడం లేదు..

డాన్స్ రిహార్సిల్స్ చేస్తున్నా అని రాసుకొచ్చింది విష్ణు ప్రియా. ఈ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక విష్ణు ప్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫొటోలతో పాటు డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ భామ. టీవీ షోలతోనే కాదు ప్రైవేట్ సాంగ్స్ లోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటింది విష్ణు ప్రియా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *