నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి, చా వు బ్రతుకుల్లో జబర్దస్త్ పింకీ.

జబర్దస్త్ లో ట్రాన్స్జెండర్ కమెడియన్ గా క్లిక్ ఐన పింకీ తన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. అలాంటి పింకీ కొంత కోలుకుని లైఫ్ లో సెటిల్ అయ్యి షోస్, ఈవెంట్స్ చేస్తూ ఉన్న ఈ టైములో ఆమెకు జీ తెలుగులో సూపర్ జోడి ఆఫర్ వచ్చింది. అయితే సూపర్‌ జోడీ డాన్స్‌ చేస్తున్న క్రమంలో దాదాపు 20 రోజుల నుంచి పింకీ సరైన రెస్ట్‌ లేకుండా డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్లెట్స్‌ను విపరీతంగా వాడింది.

అదే ఇప్పుడు ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. వైరల్‌ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరిన పింకీకి బ్లడ్‌ ఇన్ఫెక్షన్‌, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌తో పాటు లివర్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే పింకీ వీడియోవ విడుదల చేసి అందులో ఇలా తెలిపింది.. ‘నేను చేసిన తప్పును తప్పును ఇంకెవరూ చేయకండి. రెస్ట్‌ లేకుండా 20 రోజుల పాటు డాన్స్‌ ప్రాక్టీస్‌ చేశా.. దాంతో ఒళ్లు నొప్పుల తగ్గడానికి పెయిన్ కిల్లర్స్‌ వాడా.. అలా ఎక్కువ వాడటంతోనే ఇక్కడి దాకా వచ్చింది. వైరల్‌ ఫీవర్‌ సివియర్‌ కావడంతో ప్లేట్‌లేట్స్‌ కూడా బాగా పడిపోయాయి. బాడీ బాగా డీహైడ్రేట్‌ అవ్వడంతో బ్లడ్‌ ఇన్ఫెక్షన్‌, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌, లివర్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చిందని డాక్టర్స్‌ అంటున్నారు.

కాబట్టి అంతా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వాటర్‌ ఎక్కువగా తాగండి. డాక్టర్‌ సలహా లేకుండా ఎలాంటి మెడిసిన్‌ వాడొద్దు. ఎందుకంటే.. ఏదైనా అయి హాస్పిటల్‌కి వస్తే.. వంద, వేయితో అయిపోదు.. లక్షలు ఖర్చు అవుతాయి’ అంటూ పింకీ ఎమోషనల్‌గా మాట్లాడింది. తనకు ఈ టైమ్‌లో కాజల్‌, యాంకర్‌ శివ, వాళ్ల డైరెక్టర్‌, సిరి హన్మంత్‌ ఇంటికి వచ్చి తనను ఎప్పటికప్పుడు బాగా చూసుకున్నారని, తన అన్న వదిలనలు కూడా ఇక్కడికి వచ్చేశారంటూ ఆస్పత్రి బెడ్‌పై నుంచే వీడియో రివీజ్‌ చేసింది పింకీ. మరి పింకీకి ఇలాంటి పరిస్థితి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *