వెలుగులోకి వేణు స్వామి చీకటి మోసాలు, సీక్రెట్ గా హీరోయిన్స్ ఫోటోలతో..!

ఈ ప్రముఖ జ్యోతిష్యుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన వర్షం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ పెద్ద మనిషి చాలా ఫెమస్. సెలబ్రెటీల జాతకాలు చెప్పి పాపులర్ అయ్యాడు వేణు స్వామి. సెలబ్రెటీల జాతకాలతో పాటు ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పగలరు ఈయన. ముఖ్యంగా సెలబ్రెటీల విడాకుల గురించి కూడా ముందే చెప్తారు వేణు స్వామి. వేణు స్వామికి నిజంగానే అంత బాగా జాతకాలు తెలిస్తే తనని తాను బాగు చేసుకోవచ్చు కదా.. ఎందుకు జాతకాలు చెప్పుకుంటున్నారు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రశ్నలకు వేణు స్వామి తాజాగా ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు.

ఈ క్రమంలో వేణు స్వామి తొలిసారి తన ఆస్తుల చిట్టా విప్పారు. వేణు స్వామి చెప్పిన విషయాలు గమనిస్తే దిమ్మ తిరగాల్సిందే. ఆయన అంత పెద్ద కోటేశ్వరుడా అని ఆశ్చర్యపోతారు. వేణు స్వామి మాట్లాడుతూ.. నాకు జాతకం చెప్పడం ద్వారా మాత్రమే డబ్బులు రావు. సినిమా సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు నా దగ్గరకి వస్తారు. సామాన్య జనాలకు కూడా టైం కేటాయిస్తున్నా. ఇవి కాకుండా నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. నాకు ఒక పబ్, ఒక వైన్ షాప్, రేంజ్ రోవర్ కారు.. ఇంకా ఇతర వ్యాపారాలు ఉన్నట్లు వేణు స్వామి షాకిచ్చారు.

జ్యోతిష్యం చెప్పే వాడి జాతకం బావుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు అని వాగే వారికి నా సంపాదనే సమాధానం. నా రేంజ్ ఇది అని వేణు స్వామి అన్నారు. నాతో పాటు నా భార్య కూడా సంపాదిస్తుంది. ఆమె సంగీతంలో ప్రావీణ్యురాలు అనే సంగతి తెలిసిందే. ఎవరైనా భార్య మీద ప్రేమతో కసిగా సంపాదిస్తారు. తాను కూడా తన భార్య వీణా శ్రీవాణిపై ప్రేమతో ఇంత సంపాదించినట్లు వేణు స్వామి ఫన్నీగా అన్నారు. ప్రతి నెల తాను జీఎస్టీ ట్యాక్సులు కూడా కడుతున్నట్లు వేణు స్వామి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *