చైతన్య సమంత విడిపోతారని వాళ్ల పెళ్లికి ముందే చెప్పడం ద్వారా వేణుస్వామి పేరు వార్తల్లో నిలిచింది.హీరోయిన్ రకుల్ వైవాహిక జీవితం గురించి కూడా వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారనే సంగతి తెలిసిందే. అయితే వేణుస్వామి భార్య కూడా ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తే కావడం గమనార్హం.వేణుస్వామి భార్య పేరు శ్రీవాణి కాగా వీణ వాయించడం ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న శ్రీవాణిని అందరూ వీణా శ్రీవాణి అని పిలుస్తారు. అందంగా వీణ వాయిస్తూ దానినే తన ఇంటి పేరుగా మార్చుకున్న వీణ శ్రీవాణి.. వేణు స్వామి భార్య అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె వేణు స్వామితో లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయింది. తన భర్త గురించి, ప్రేమ కథ గురించి అన్ని సీక్రెట్స్ రివీల్ చేసింది. మీది లవ్ మ్యారేజ్ అని విన్నా అని యాంకర్ అంటే.. వీణా వాణి సిగ్గు పడుతూ అవును అని చెప్పింది. ఆ తర్వాత అందుకు సంబంధించిన విషయాలు చెప్పుకొచ్చింది. మీరేమో సన్నగా అందంగా ఉన్నారు అని యాంకర్ అడగ్గా.. మా ఆయన తిరుపతి లడ్డు అంటూ నవ్వుతూ సమాధానాలు చెప్పింది వీణా శ్రీవాణి. తనకు మొదట ఆయనే ప్రపోజ్ చేశారు అని ఆమె చెప్పింది.

తన కజిన్ డాటర్ ని తీసుకువెళ్ళడానికి ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చారు. అప్పుడు నన్ను చూసి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పారట. అలా పెళ్లి కూడా జరిగిపోయిందని.. భర్త సలహాతో సినిమా పాటలు కూడా చేయడం ప్రారంభించా. అప్పటి నుంచి తనకు గుర్తింపు పెరుగుతూ వచ్చింది అని వీణా శ్రీవాణి చెప్పింది. నేను అందానికి ప్రాధాన్యత ఇవ్వను అని చెప్పిన వీణా శ్రీవాణి.. తిరుపతి లడ్డూ అని పిలుస్తానంటూ మురిసిపోయింది. ఇద్దరిదీ సేమ్ కమ్యూనిటీ అని కూడా చెప్పింది. వీణ శ్రీవాణికి సోషల్ మీడియాలో మిలియన్లలో ఫాలోయింగ్ ఉంది.