సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ వేణు స్వామి వార్తల్లో నిలుస్తున్నారు.
వీక్షకులను ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడం, అందుకు తగిన విధంగా వివరణ ఇవ్వడం వేణు స్వామి ప్రత్యేకత. నాగచైతన్య – సమంత ఎక్కువ కాలం కలిసి వైవాహిక జీవితం గడపలేరంటూ వారి పెళ్లి సమయంలో వేణుస్వామి చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే నాలుగేళ్లు తిరగకముందే చైతు – సమంత విడాకులు తీసుకోవడంతో వేణుస్వామి పేరు వార్తల్లో నిలిచింది.
ఇక ఇటీవల టాలీవుడ్ లో త్వరలో ఒక యంగ్ హీరో, ఒక యంగ్ హీరోయిన్ చనిపోతారంటూ ఆయన రెండు నెలల కిందట వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పేరు అందరినోళ్లలో నానుతోంది. వేణుస్వామి వ్యక్తిగత జీవితం తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఆయన విద్యార్హత, కుటుంబ నేపథ్యం, భార్య పిల్లల గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.