ఎవరెన్ని చెప్పినా 2024లో జగనే సీఎం అవుతారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. జాతకరీత్య జగన్ మళ్లీ సీఎం అవుతారని.. చంద్రబాబు ఇక ఎప్పటికీ సీఎం కాలేరని వేణు స్వామి తేల్చి చెప్పారు. జగన్ జాతకంలో బుధ మహర్దశ ప్రవేశించిందని.. మరో 17 ఏళ్లు ఆయన్ను కదిలించే శక్తి ఏది లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంటే మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు.
2019 గెలిచిన జగన్ 2024,2029 ఎన్నికల్లో కూడా గెలుచి సీఎం అవుతారని వేణు స్వామి తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక రాజకీయ నాయకుల జాతకాలు గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి ముందే చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్టైయ్యారు. ఇక ఏపీలో మరోసారి జగనే అధికారంలోకి వస్తారని వేణు స్వామి పలు ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది.
తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు గెలుపు కొందరు కష్టమే అని తేల్చేశారాయన.