తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త స్టార్ కపుల్ ఎవరు? ముందుగా ప్రేక్షకులు అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , సొట్టబుగ్గల అందాల రాక్షసి లావణ్యా త్రిపాఠి. నవంబర్ 1న వీళ్ళిద్దరూ ఇటలీలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు ఈ జంట డెహ్రాడూన్ ప్రయాణం అయ్యింది. అయితే తాజాగా లావణ్య-వరుణ్ జోడీ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమైంది.
భార్యని తీసుకుని తొలిసారి వరుణ్ అత్తవారింటికి బయల్దేరినట్లు తెలుస్తోంది. అక్కడకు వెళ్లిన తర్వాత వాళ్ల సంప్రదాయం ప్రకారం వరుణ్ కొన్ని కట్టుబాట్లు అనుసరించాల్సి ఉంటుంది. లావణ్య త్రిపాఠిది అయోధ్య దగ్గర ఒక ఊరు. ప్రస్తుతం ఫ్యామిలీ డెహ్రాడూన్ లో ఉంటుంది. కొత్త దంపతులు నేరుగా డెహ్రాడూన్ కి వెళ్తారు. అక్కడ లావణ్య తల్లిదండ్రులు గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.
పెళ్లి సంబురాలు మొదలైన దగ్గర నుంచి కొణిదెల కుటుంబమే హైలైట్ అయ్యింది. ఎక్కడా లావణ్య తరుపు తల్లిండ్రు లుగానీ..బంధువర్గం గానీ పెద్దగా కనిపించలేదు. వాళ్లెవ్వరు సెలబ్రిటీ కాకపోవడంతో? ఎవరు ఏంటి అన్నది ఎవరికీ తెలియకపోవడమే అందుకు కారణం. డెహ్రాడూన్ లో రిసెప్షన్ బంధువులు …స్నేహితు లు..హితులు..సన్నిహితుల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సెలబ్రేషన్ కూడా గ్రాండ్ గా జరగనుంది. ఎలాగూ ఇద్దరూ సెలబ్రిటీలు కాబట్టి ఆ ఫోటోలు నెట్టింట లీక్ అవుతాయి.