వరుణ్-లావణ్యల పెళ్ళిలో ఒక్కటైన చైతు, సమంత, ఎలా మాట్లాడుకున్నారో చుడండి.

నాగచైతన్య , సమంత.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి చూడ్డానికి ఇటలీ బయలుదేరారు. మీరు వెళ్తూ ఉండగా ఎయిర్పోర్ట్లో కొందరికి కనిపించారు. ఎయిర్పోర్ట్లో కనబడిన వాళ్ళ ఫోటోలు తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో వాటిని విపరీతంగా హల్చల్ చేస్తున్నారు. ఈ జంట ఇప్పుడు పెళ్లికి వెళ్లి అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారు అని ఆలోచిస్తున్నారు. అయితే మొదట ప్రేమించి , తర్వాత కలిసి సహజీవనం చేసి.. ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరి తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువచ్చారు చైతన్య, సమంత.

పెళ్లయిన కొత్తలో వీరి కాపురం టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు జంట అంటే ఇలా ఉండాలి అని అందరూ అనుకునే లోపే.. పబ్లిక్ గా తమ విడాకులను అనౌన్స్ చేశారు ఈ ఇద్దరు. బెస్ట్ కపుల్స్ ఉండే వీరు అలా విడిపోవడంతో అందరూ నోరెళ్ల బెట్టారు. ఇక అప్పటినుంచి ఇద్దరినీ ఒక దగ్గర చూసిన సందర్భమే లేదు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ వరుణ్ తేజ్ పెళ్లిలో ఒకటిగా కనిపించబోతున్నారు.

మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పెళ్లి ముహూర్తం నిశ్చయించడం జరిగింది. మెగా వారి పెళ్లికి హాజరు కావటానికి ఈ మాజీ జంట ఇటలీకి వేరు వేరు ఫ్లైట్స్ లో బయలుదేరారు. అయితే అక్కడికి వెళ్ళాక.. ఒకే ఫంక్షన్ లో కలిసాక.. మాట్లాడుకుంటారా లేక ఎడమొహం పెడ మొహం గానే ఉంటారా అనేది చూడాలి. విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వీరిద్దరూ కలుస్తూ ఉండడంతో అందరి దృష్టి వీరిపైనే ఉంది. ఇంతకీ అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్న విషయం పెళ్లి ఫోటోలు వచ్చాక గాని తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *