ఇందుకే వంగలపూడి అనిత కు హోంశాఖ మంత్రి పదవి ఇచ్చారు, వైరల్ వీడియో.

ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంగలపూడి అనిత… పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు… ఏకంగా చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ ఖరారు చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. వంగలపూడి అనిత రాజకీయాల్లో రాకముందు ప్రభుత్వ టీచర్ గా పని చేశారు. అయితే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె… 2012లో రాజకీయాల్లోకి వచ్చారు.

అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ హోంశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. హోం శాఖను అనితకు కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో ఓ వాడి వేడి చర్చ అయితే ఊపందుకుంది. ఆమెకు ఈ శాఖను కేటాయించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేశారనే ఓ చర్చ సైతం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలు చాలా మందే ఉన్నా.. వారిలో ఫైర్ బ్రాండ్ల్ మాత్రం అతి కొద్దిమందే ఉన్నారు.

వారిలో తొలి వరుసలో ఉన్న నేతల్లో వంగలపూడి అనిత ఒకరన్నది సుస్పష్టం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు మంత్రులు.. ప్రతిపక్ష పార్టీ అధినేతలపై మాటల దాడికి దిగితే.. వాటినన్నింటికి తన మాటలతో సమాధానమిచ్చిన ఒకే ఒక్క మహిళా నేత వంగలపూడి అనిత. అందులోభాగంగానే వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ నుంచి పార్టీలోని మంత్రుల వరకు ఎవరికి, ఎలా.. ఎంత మోతాదులో సమాధానమివ్వాలో.. అంతే స్థాయిలో అనిత కౌంటర్ ఇచ్చిన విషయాన్ని రాజకీయ వర్గాలు ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *