మెగా గ్రాండ్ డాటర్ కూడా ఆ హనుమంతుడికి ప్రీతిపాత్రమైన మంగళవారం రోజు జన్మించడంతో మెగా ఫ్యామిలీ హర్షం వ్యక్తం చేసింది. మహాలక్ష్మి రాక తమ కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపిందన్నారు చిరంజీవి. పాప మంచి ఘడియల్లో పుట్టిందని, జాతకం కూడా చాలా బాగుందని అంటున్నారని పొంగిపోయారు.
ఆ ప్రభావం ముందు నుంచీ తమ ఫ్యామిలీలో కనబడుతుందని చెప్పారు. రామ్ చరణ్ స్టార్ డమ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం, వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఇలా అన్నీ శుభాలే జరుగుతున్నాయని అన్నారు. మనవరాలు పుట్టినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని.. ఇన్నేళ్ల తర్వాత మా చేతుల్లోకి పండంటి బిడ్డని రామ్ చరణ్ ఉపాసన పెట్టినందుకు..
వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన అపోలో ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన సమయంలో వారిపై పూల వర్షం కురిపించారు.