ఇప్పుడు దేశం మొత్తం అంబానీ ఇంట పెళ్లి గురించి మాట్లాడుకుంటోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉంటూ వస్తున్న ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి అంటే మామూలు విషయం కాదుగా. చిన్న కొడుకు, ఆపై ఈయన తర్వాత చిన్నోళలు లేరు, దీంతో అంబానీ ఇంట పెళ్లి కార్యక్రమం ఆకాశాన్ని అంటింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకల మధ్య పాత అభిమాని వీడియో ఒకటి మళ్లీ వైరల్‌గా మారింది.
అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జులై 12న అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రెటీలు, ప్రముఖులు అనంత్- రాధికా వివాహ వేడుకలకు హాజరు కానున్నారు.
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అంబానీ వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు ఫ్యామిలీతో కలిసి ముంబై బయలుదేరారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో భార్య ఉపాసన, కూతురు క్లింకార తో కలిసి కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.