అప్పట్లో బుల్లితెరపై ఆమె ఒక వెలుగు వెలిగింది. ఉదయభాను ఆ తర్వాత ఝాన్సీ మధ్య మంచి పోటీ ఉండేది. ఉదయభాను అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు లేరు. కొన్నేళ్ల పాటు యాంకర్‌గా చాలా బిజీ గా కొనసాగిన ఉదయభాను పెళ్లి తర్వాత ఇప్పుడు యాంకరింగ్‌కు దూరంగా ఉంటోంది. అయితే యాంకర్ బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు చిత్రాల్లో నటించింది. అయితే ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఉదయభాను ఇండస్ట్రీకి దూరం అవడం అనేది బాధాకరమైన విషయమే.
కానీ తాజాగా ప్రమోషన్లో భాగంగా మళ్లీ యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే అఖండ సక్సెస్ మీట్లో ఉదయభాను బాలయ్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలయ్య బాబు లాంటి మహానుభావుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చూడలేదని.. ఎవ్వరు ఏమన్నా అనుకొని నాకు ఎవరు మరో షో ఇవ్వకపోయినా పర్లేదు.. ఇది నేను గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్తున్నాను.. బాలయ్య బాబుకు వేరెవరూ సాటి లేరు.. హాట్సాఫ్ బాలయ్య.. మీరు ఎప్పుడూ ఇలానే ఉండాలి.. మిమ్మల్ని దగ్గర్నుండి చూసిన వారెవ్వరైనా గుండెల్లో గుడి కడతారు. ఎన్నోసార్లు నేను బాలయ్య బాబు ఈవెంట్స్ చేశాను.
ఇంతకు ముందు పిల్లలు పుట్టక ముందు చాలా బిజీగా ఉండేదాన్ని. ఏదైనా ఈవెంట్ ఉంటే బాలయ్య బాబు గారు అందరి కంటే ఫస్ట్ వచ్చేవారు. మిగతా హీరోలకు కాకుండా హడావిడి లేకుండా వచ్చి కూర్చునేవారు. వాళ్లు రిక్వెస్ట్ చేస్తే చివరి టెక్నీషియన్ వరకు గిఫ్ట్ ఇచ్చేవరకు ఉండండి సార్ అంటే.. ఎటువంటి ఆలోచన లేకుండా అక్కడ నిల్చుని.. వాళ్ళందర్నీ ఆశీర్వదించి వెళ్లేవారు. ఎన్ని సార్లు ఇలా కూర్చొని.. వారికి థాంక్యూ సార్ అని చెప్పానో..అప్పుడు నా మీద ఎన్ని ట్రోల్స్ నడిచాయో సార్..బట్ ఐ డోంట్ కేర్.. ఎందుకంటే బాలయ్య బాబు కి అభిమానులుగా మారిన తర్వాత దేనికైనా సిద్ధం కావాలంటూ చెప్పుకొచ్చింది ఉదయభాను.