కార్తీకమాసం అంతా మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపయేలా చేయటమే ఈ మాసం ప్రత్యేకత. సాధారణ రోజుల్లో పూజలు చేసినా కార్తీకమాసం మాత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్తిక భావన కలిగిస్తుంది. శ్రావణమాసంలో శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కార్తీక మాసంలో సోమవారాలకు అంతటి విశిష్టత ఉంది. అంతేకాదు కార్తీకంలో వచ్చే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులకు అంతటి విశిష్టత ఉంది. శ్రావణమాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థిస్తే..కార్తీకమాసంలో ఆమె పతిదేవుడైన శ్రీమహావిష్ణువు పూజింటం ఈ మాసం ప్రత్యేకత.
అయితే తులసి మొక్కకు నీళ్ళు పోయండి..కార్తీక మాసంలో తులసి మొక్కకు రోజూ నీళ్ళు సమర్పించి సాయంత్రం మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, దారిద్ర్యం తొలగిపోతాయని నమ్మకం. అంతే కాకుండా ఈ మాసంలో తులసి మొక్కకు పచ్చి పాలను కూడా ఇవ్వవచ్చు. ఈ దిశలో తులసిని నాటండి..వాస్తు ప్రకారం, తులసి మొక్కను ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటాలి. దీనితో పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తులసి పూజ చేయాలి. సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు.
సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయడమే కాదు. ఈ సమయంలో తులసి మొక్కను కూడా ముట్టుకోవద్దు. విష్ణువుకు తులసిని సమర్పించండి..విష్ణుకు తులసి అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో మహావిష్ణువు పూజ సమయంలో, తులసి రేకులను ఆయనకు సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం లభిస్తుందని, కుటుంబ సభ్యుల సంతోషం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు. ఈ మంత్రాన్ని జపించండి..కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజూ తులసి మొక్కను పూజించి, నెయ్యి దీపం వెలిగించాలి.
దీనితో పాటు ‘ఓం నమో భగవతే నారాయణాయ’ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల మనిషి జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. తులసి మొక్కను దానం చేయండి..కార్తీక మాసంలో తులసి మొక్కను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ మాసంలో కొత్త తులసి మొక్కను నాటండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం.