గుంటూరు కారం సినిమా చూస్తే దర్శకుడు త్రివిక్రమ్‌లో పస పూర్తిగా తగ్గినట్టే అన్పిస్తోంది. తల్లీకొడుకుల బంధాన్ని ఆసక్తిగా మల్చడంలో త్రివిక్రమ్ విఫలమయ్యాడు. కధ పరంగా సినిమాకు మైనస్ మార్కులే పడుతున్నాయి. సినిమా కధ ఏంటనేది ప్రారంభంలోనే తేలిపోవడం అతి పెద్ద మైనస్. సినిమా చూడాలనే ఆసక్తి పోతుంది. తల్లీ కొడుకుల పాత్రపై ఉండాల్సిన పట్టు కన్పించలేదు.
కొడుకుతో అగ్రిమెంట్ సైన్ చేసినంత మాత్రాన రాజకీయంగా ఇబ్బందులు రావని చూపించడంలో లాజిక్ పూర్తిగా మిస్సయింది. త్రివిక్రమ్ చూపించిన రాజకీయ ఎత్తుగడలు సహజత్వానికి దూరంగా ఉన్నాయి. ఇక సినిమాకు ప్లస్ పూర్తిగా మహేశ్ బాబు నటన. మహేశ్ బాబు పాత్ర చేసే హంగామా, అతని ఎనర్జీ, మాస్ పాటలు, క్లైమాక్స్ సీన్స్, కొన్ని ఎమోషనల్ దృశ్యాలు సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు.
సినిమాకు మహేశ్ బాబు నటన హైలైట్. అద్భుతమైన డ్యాన్స్ కూడా కన్పిస్తుంది. కుర్చీ మడతపెట్టి పాటలో మహేశ్, శ్రీలీల హంగామా చూసి తీరాల్సిందేనంటున్నారు ప్రేక్షకులు. మహేశ్ బాబు నటన, శ్రీలీల డ్యాన్స్ సినిమాకు బలం కాగా, కధ, కధనం పూర్తిగా మైనస్. త్రివిక్రమ్ మార్క్ సినిమాలో కన్పించలేదు.