రైలులోని మహిళా కంపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.నల్లటి దుస్తులు ధరించిన మహిళ కెమెరా ముందు కాన్ఫిడెంట్‌గా డ్యాన్స్ చేసింది.అయితే, కొంతమంది ప్రయాణికులు వీడియోలో పెంచడానికి ఇష్టపడలేదు. పూర్తీ విరలోకి వెళ్తే ముంబై లోకల్ ట్రైన్ లోని లేడీస్ బోగీలో ఈ రీల్ రికార్డయింది. ముదురు నలుపు రంగు దుస్తులు ధరించిన ఆ అమ్మాయి ఎలాంటి బిడియం లేకుండా సెల్ ఫోన్ కెమెరా ముందు డాన్స్ చేసింది.
తమతో పాటు చిత్రీకరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు బ్యాగులతో ముఖాలు దాచుకోగా, మరికొందరు వీడియోలో భాగం కావడం ఇష్టంలేక ట్రైన్ దిగి వెళ్లిపోయారు. అదేవిధంగా అదే డ్యాన్సర్ కు చెందిన మరో వీడియో కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వారు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇతర ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉందని మండిపడ్డారు. ఈ ఘటన సెంట్రల్ రైల్వేలో రికార్డయింది. ఇంటర్నెట్ లో హల్ చల్ చేసిన డాన్స్ రీల్ ను గమనించిన రైల్వే అధికారులు ఎక్స్ పోస్ట్ లో స్పందించి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ రైల్వే సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది. ఇదిలా ఉంటే డాన్స్ రీల్స్ పై స్పందించిన జనాలు దీన్ని ‘క్రేజీ’ అని కామెంట్ చేశారు. దీనికి సమాధానంగా మరికొందరు మీమ్స్ షేర్ చేయగా.. ‘ఇది మరీ టూమచ్’ అంటూ విరుచుకుపడ్డారు. పబ్లిక్ రైలులో ఇంటివారిని రైలులో అనుమతించకూడదని నేను అనుకుంటున్నాను.. అని మరికొందరు రియాక్ట్ అయ్యారు.
Now I know why railways stocks are skyrocketing pic.twitter.com/HBaExbats4
— desi mojito 🇮🇳 (@desimojito) February 23, 2024