బ్రేకింగ్ న్యూస్, హఠాత్తుగా ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.

మంగళవారం జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో పొగలు వచ్చిన సంగతి తెలిసిందే. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ బోగిలో ఒక్కసారిగా పొగలు వచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు. పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళుకు గురై రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్రైన్ ను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నిలిపారు. రైలు ఆగగానే ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు.

అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్ లో ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ట్రైన్ ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ ఫ్లాట్ ఫాంపైకి దూసుకు వెళ్లింది. కాకపోతే అప్పటికే ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. రైలు దూసుకు వచ్చిన సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

రైలు ఫ్లాట్ ఫామ్ పైకి ఎలా దూసుకు వచ్చిందో తెలియలేదని స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ రుపుతున్నట్లు చెప్పారు. రైలు షకూర్ బస్తీ నుంచి బయలుదేరిన ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌ రైలు రాత్రి 10.49 గంటలకు మధుర స్టేషన్ కి వచ్చింది.. ప్రయాణికులు దిగిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. హఠాత్తుగా రైలు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామం అని స్టేషన్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *