టాలీవుడ్‌లో మిమిక్రీకి మంచి గుర్తింపు తీసుకొచ్చినవారిలో శివారెడ్డి పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తాను మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయంలో మిమిక్రీని చాలావరకు ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ కొన్నాళ్లకే మిమిక్రీలో కింగ్‌గా వెలిగిపోయి.. నేను కేవలం మిమిక్రీలే చేస్తానని కొంత మంది అనడం విన్నాను.
మిమిక్రీ కాకుండా చాలా పాత్రలు బ్రహ్మాండంగా చేశాను. చాలా మంది టాలెంట్ ఉండి క్యారెక్టర్ బాలేక దూరం అవుతారు ఇండస్ట్రీకి. మరికొందరు క్యారెక్టర్ లేకపోయినా బాగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటివాళ్లు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. కానీ నాలో మంచి క్యారెక్టర్ ఉంది టాలెంట్ ఉంది.
అయినా కూడా ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఎందుకు ఉంటున్నానో నాకూ తెలీడంలేదు. శివారెడ్డిని ఎవరో తొక్కేశారు అని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. అది నిజమే. కానీ ఇప్పటివరకు నన్ను తొక్కేసిన వ్యక్తి పేరు నేను బయటపెట్టలేదు. నాకు అవకాశాలు లేకపోయినా ఆ పేరు బయటికి చెప్పలేదు’’