షారుఖ్ ఖాన్‌తో రొమాన్స్ చేసిన మహీరా ఖాన్, పాకిస్థానీ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది మరియు ఆమె వివాహ ఫోటోలు కొన్ని కనుగొనబడ్డాయి. మహీరా ఖాన్ అనే పాకిస్థానీ నటి రయీస్, హమ్‌సఫర్ సినిమాల్లో నటించి సై అయ్యింది. ఇప్పుడు నటి రెండవసారి వివాహం చేసుకుంది మరియు బంధువుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. అయితే జీవితంలో చాలాసార్లు ఓడిపోతాం.. కానీ ఆశాభావంతో ముందుకు సాగాలి.
తన జీవితంలో కూడా చాలా కష్టమైన పీరియడ్ ఒకటుందని అందరికీ తెలియాలనే తాను ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నా అన్నారు మహీరా ఖాన్ . ఈమె పాకిస్తాన్లో పాపులర్ హీరోయిన్, అత్యధిక పారితోషికం తీసుకునే నటి.’2017లో మహిరా షారుఖ్ ఖాన్ సరసన నటించిన రయీస్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవలే వ్యాపారవేత్త సలీం కరీమ్ని రెండో వాహం చేసుకుంది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో మహిరా ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఎదగడానికి చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.

తన కెరీర్లో ఒకానొక సమయంలో ఫ్లోర్లు ఊడ్చి, టాయిలెట్లను శుభ్రం చేశానని ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, జీవనం సాగించానని చెప్పుకొచ్చారు. లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నప్పుడు టాయిలెట్లను శుభ్రం చేయడం, ఫ్లోర్లను శుభ్రం చేయడం లాంటివి చేశానన్నారు. నిజానికి చేతిలో ఒక్క డాలర్ కూడా లేని టైంలో ఉన్న కొద్ది పాటి భోజనాన్ని సోదరుడితో కలిసి పంచుకున్నట్లు తెలిపారు. తాను బైపోలార్ డిజార్డర్ అనే ‘మానిక్ డిప్రెషన్’తో పోరాడినట్లు తెలిపారు.
ముఖ్యంగా “రయీస్” చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శల వల్ల అనారోగ్యం పాలైనట్లు తెలిపారు. దాదాపు ఆరేడు సంవత్సరాలు యాంటి డిప్రెసెంట్స్‌తో మేనేజ్చేసినట్టు చెప్పారు. తన ప్రయాణం అంత సులువుగా సాగలేదని.. కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి రావడం తనకు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చారు.