అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ తన నివాసంలో కిందపడటంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించి తుంటి సర్జరీ చేశారు. తుంటి సర్జరీ అనంతరం కేసీఆర్ ఇటీవల కోలుకున్నారు.
దీంతో ఈనెల 2న అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత పార్లమెంటరీ సమీక్షా సమావేశాల్లో కేసీఆర్ తరచూ పాల్గొంటున్నారు. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు.
కేసీఆర్ సీఎం.. కేసీఆర్ సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నల్లగొండలో భారీ బహిరంగసభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రాజెక్టుల అప్పగింత వల్ల.. తెలంగాణ రైతాంగం భారీగా నష్టపోతుందని బీఆర్ఎస్ వాదిస్తోంది.