గతంలో వైఎస్ఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయారని,ఆయన తనయుడు జగన్… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు తిన్నారని, కృష్ణా నీటిపై దాదాపు 6 గంటల పాటు చర్చించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుమతి తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అయితే సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేరుగా జగన్ పేరు ప్రస్తావించి కామెంట్ చేయని రేవంత్ రెడ్డి..మరికొద్ది రోజుల్లో ఏపీ ఎన్నికలు జరుగున్న ఈ సమయంలో జగన్ పై డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. అది కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు.
గతేడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఒకరోజు ముందు తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఏపీ పోలీసుల సాయంతో జగన్ ఆక్రమించుకోవాలనుకుంటే కేసీఆర్ మారు మాట్లాడలేదని విమర్శించారు. దమ్ముంటే ఇప్పుడు రావాలని జగన్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.