స్టూడెంట్స్ తో టీచర్ మాస్ డ్యాన్స్, నెట్టింట చెక్కర్లు కొడుతున్న వీడియో.

ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌, స్టూడెంట్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. టీచర్‌ పదవి విరమణ చేసిన సందర్భంగా పాఠశాలలో చివరి రోజు కావడంతో..ఆమె పిల్లలతో సరదగా డ్యాన్స్‌ చేశారు. ఈ డ్యాన్స్‌ వీడియోను టీచర్‌ మను గులాటి స్వయంగా ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే క్లాస్ రూమ్ లో ఓ టీచర్ ఓ సినిమా పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు.

ఈ డ్యాన్స్ చేస్తున్న టీచర్ ను ఇద్దరు విద్యార్ధులు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ సినిమా బంటి ఔర్ బబ్లీలో ఐశ్వర్యరాయ్ నటించిన కజ్‌రారే పాటకు టీచర్ డ్యాన్స్ చేశారు. ఓ విద్యార్ధిని కూడ టీచర్ తో కలిసి స్టెప్పులేశారు. క్లాస్ రూమ్ లో ఉన్న బ్లాక్ బోర్డులో టీచర్ బర్త్ డేను పురస్కరించుకొని హ్యాపీ బర్త్ డే మేడం అని రాసి ఉంది.

ఈ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు.ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వందలాది మంది వీక్షించారు.క్లాస్ రూమ్ లో టీచర్ డ్యాన్స్ చేయడాన్ని కొందరు నెటిజన్లు తప్పు బట్టారు. మరికొందరు నెటిజన్లు టీచర్ డ్యాన్స్ చేయడాన్ని సమర్ధించారు. గతంలో కూడ ఇదే తరహాలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో క్లాస్ రూమ్ లో టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *