ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. చిన్నపాటి అవకాశాన్ని సైతం వదులుకోకుండా ముందుకెళ్తోంది. ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసిన టీడీపీ.. అభ్యర్థులకు సలహాలు, సూచనలు చేయడానికి ప్లాన్ చేసింది.
ఇందులో భాగంగా శనివారం నాడు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇంచార్జులకు టీడీపీ వర్క్ షాప్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షత వహించబోతున్నారు. ఎన్నికల వ్యూహాలపై ఈ వర్క్‌షాప్‌లో కీలక చర్చ జరగనుంది.
అభ్యర్థులకు అధినేత కీలక సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01:30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనున్నది. 11 గంటలకు వర్క్‌షాప్‌ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం చేయనున్నారు.