నటి కరాటే కళ్యాణీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడే తనకు బిగ్ బాస్ లో పరిచయం అయి క్లోజ్ ఫ్రెండ్ గా మారిన సూర్య కిరణ్ మృతిపై స్పందించింది. ముఖ్యంగా ఆయన చనిపోవడానికి గల కారణాలు గురించి వివరించింది. అసలు సూర్య కిరణ్ గారు చనిపోవడానికి ఆయన అలవాట్లేనని తెలిపింది.
సూర్య కిరణ్ కు మందుతాగే అలవాటుతో పాటు సిగరెట్లు తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. వాటి వల్లే ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయని చెప్పింది. రోజూ.. ఎక్కువగా సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం చేసే వారని నటి కరాటే కల్యాణి వెల్లడించింది. వాటి వల్లే ఆయన చాలా కాలంగా అనేక రకాల హెల్త్ సమస్యలతో బాధ పడుతున్నారని.. ఈరోజు ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చింది.
అయితే ఆయన అంతగా మద్యం సేవించడానికి, సిగరెట్లు తాగడానికి చాలా కారణాలు ఉన్నాయని కూడా క్లారిటీ ఇఛ్చింది. ఆయన మాజీ భార్య, హీరోయిన్ కళ్యాణీ వల్లే ఆయనకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటూ పేర్కొంది.