తమ ప్రియతమ సహ నటుడికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు తమిళ సినీ ప్రపంచం కూడా తరలి వచ్చింది. వేడుకలకు హాజరుకాని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. అయితే గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28న చెన్నైలోని మియాత్ ఆసుపత్రిలో తుదిశ్వస విడిచారు. ఆయన మరణం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదం నింపింది. నటీనటులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు విజయకాంత్ భౌతికకాయానికి ప్రత్యక్షంగా నివాళులు అర్పించారు.
ఆయన మరణించిన సమయంలో పలువురు సినీ ప్రముఖులు విదేశాల్లో ఉండడంతో వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా విజయ్‌కాంత్ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఇప్పుడు విదేశాల నుంచి చెన్నైకి తిరిగి వచ్చిన హీరో సూర్య శుక్రవారం ఉదయం విజయ్‌కాంత్ స్మారకమందిరాన్ని సందర్శించి.. నివాళులర్పించారు. విజయ్‌కాంత్ స్మారకం వద్ద వెక్కి వెక్కి ఏడ్చాడు సూర్య. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ““విజయకాంత్ అన్న అంత్యక్రియల్లో పాల్గొనలేకపోవడం కోలుకోలేని లోటు.
అన్నను కోల్పోవడం చాలా బాధాకరం. పెరియన్న సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది. నటీనటుల సంఘాన్ని పునరుద్ధరించడంలో విజయకాంత్ పాత్ర చాలా పెద్దది. అన్నన్‌లాంటి వారు ఎవరూ లేరు.. ఆఖరికి ఆయన ముఖం కూడా చూడకపోవడం నాకు తీరని లోటు.. ఎప్పటికీ గుర్తుండిపోతారు. నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ.. ఎనిమిదేళ్లు ఉపవాసం ఉన్నాను. ఆ సమయంలో నన్ను గమనించి నువ్వు నటుడివి.. నీ శరీరంలో శక్తి ఉండాలి అంటూ దగ్గరుండి ఆహారం తినిపించాడు” అంటూ ఎమోషనల్ అయ్యాడు సూర్య.
. @Suriya_offl naaa🥺🥺🥺😭 pic.twitter.com/6bS9zKSZU5
— α∂αяsн тρッ (@adarshtp_offl) January 5, 2024