బెయిల్ తర్వాత రోజా కి మాస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.

అనారోగ్య కారణాలతో ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయనకు పూర్తి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జున్ రావు తీర్పు వెలువరించారు. ఈ నెల 28న చంద్రబాబు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభలు, ప్రెస్ మీట్లలో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు.

చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని సూచించారు. సెప్టెంబర్ 9న స్కిల్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా పలుమార్లు బెయిల్ పై విచారణలు వాయిదా పడ్డాయి. అనంతరం, అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు చికిత్స కోసం అక్టోబర్ 31న 4 వారాల మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉండగా పూర్తి బెయిల్ మంజూరైంది. అయితే ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

ఈ కేసులో ఏ1 నిందితునిగా ఉన్న సీమెన్స్‌ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్‌షా అప్రూవర్‌గా మారారు. చంద్రకాంత్‌ను డిసెంబర్‌ 5న హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా వేసింది. చంద్రబాబు ప్రస్తుతం కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయటంతో భారీ రిలీఫ్ దొరికింది. రాజకీయంగానూ కీలకంగా మారుతోంది. అయితే, బెయిల్ మంజూరు విషయంలో కోర్టు ఏమైనా కండీషన్లు విధించిందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *