సర్జరీ అందరికి కలసి రావడం లేదు. అయేషా టాకియా సర్జరీ తర్వాత ఆమె ముఖం విచిత్రంగా మారింది. హీరోయిన్ ఆర్తి అగర్వాల్, కన్నడ నటి చేతనా రాజ్ లాంటి వారు సర్జరీ వికటించడంతో మృతి చెందారు. దీనితో అందానికి సర్జరీ అనేది అంత తేలికైన విషయం కాదని తెలిసిపోయింది. తాజాగా మరో సీనియర్ నటి సర్జరీ వికటించడంతో మరణించిన విషాదక సంఘటన చోటు చేసుకుంది.
అయితే ఇండస్ట్రీలో హీరోయిన్లకు కావాల్సింది గ్లామర్. యాక్టింగ్ వచ్చినా రాకపోయినా పర్లేదు అందంతో సులువుగా కెరీర్ లాగించేయొచ్చు. ఇప్పటికే పలువురు బ్యూటీస్ ఇలా చేస్తూ వచ్చారు. అయితే కొన్నిసార్లు ఇంకాస్త అందంగా మారిపోవాలనే ఆరాటం ప్రాణాలు మీదకు తెస్తూ ఉంటుంది. హీరోయిన్ ఆర్తి అగర్వాల్, కన్నడ నటి చేతన రాజ్.. ఇలా సర్జరీల వికటించి చనిపోయారు.
ఇప్పుడు ప్రముఖ నటి కూడా అలానే కన్నుమూసింది. అర్జెంటీనాకు చెందిన మాజీ అందాల సుందరి, నటి జాక్వెలిన్ కరీరీ.. మరింత అందంగా మారేందుకు కాస్మోటిక్ సర్జరీ చేసుకుంది. సర్జరీ జరుగుతున్న టైంలో రక్తం గడ్డకట్టడం వల్ల ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. పలు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించిన ఈమెకు బాగానే గుర్తింపు ఉంది. అయితే ఈమె.. అక్టోబరు 1న చనిపోయింది. తాజాగా ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో జాక్వెలిన్ మరణ వార్త అందరినీ షాక్‌కి గురిచేసింది.