సోషల్ మీడియాలో చాలా మంది క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో సుప్రీత ఒకరు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురే సుప్రీత. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది సుప్రీత. అయితే వేగంగా పాపులారిటీ సాధించడానికి సినిమా రంగం ది బెస్ట్ ఆప్షన్. హీరోయిన్ గా రాణించాలంటే మాత్రం అందం, అభినయంతో పాటు ఆకట్టుకునే గ్లామర్ షో చేయాల్సి ఉంటుంది. గతంలో పదుల కొద్దీ సినిమాల్లో నటించిన తరువాత కొంతమంది హీరోయిన్లకు పాపులారిటీ వచ్చేది. కానీ ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంటున్నారు.
అయితే ఒక్క సినిమాలో నటించకున్నా.. కేవలం సోషల్ మీడియా కారణంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది సురేఖ వాణి కూతురు సుప్రీత.అందచందాలను ఆరబోస్తూ హీరోయిన్ లెవల్లో గ్లామర్ షో చేస్తున్న ఈ ముద్దుగుమ్మ హాట్ పిక్ష్ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లతో సమానంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి గుర్తింపు ఉంది. కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు లేకుండా సినిమా వెలితిగా కనిపిస్తుంది. అలా పాపురల్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి.

అక్కగా, వదినగా, తల్లిగా నటించి.. యాక్షన్, కామెడీ రోల్ లో చేసి మెప్పించారు సురేఖ వాణి. కొన్ని సినిమాల్లో హీరోయిన్ తో సమానంగా ఆమెకు అవకాశం ఇచ్చే వారు. కుటుంబ నేపథ్యంలో ఉన్న సినిమాల్లో సురేఖ వాణి కచ్చితంగా ఉంటారు.అయితే దురదృష్టవశాత్తూ సురేఖవాణి పర్సనల్ లైఫ్ విషాదంగానే సాగింది. ఆమె భర్త అకాల భరణంతో ఆమె తీవ్ర దు:ఖసాగరంలో మునిగింది.