సురేఖ వాణి గుండు వెనుక అసలు రహస్యం ఇదే. అయన కోసమేనంటూ..?

నటిగా పరిచయం అవడానికి ముందే సురేఖ వాణి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయింది. షోలు చేస్తోన్నప్పుడే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే నటి సురేఖా వాణి తాజాగా తన అవతారం మార్చేసింది. తిరుమల వెళ్లి శ్రీనివాసుడికి తలనీలాలు(గుండు) సమర్పించుకుంది. అయితే ఆ పని దైవకార్యం కోసం చేసిందా లేక మరేదైనా కారణం ఉందా అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. సురేఖవాణి లేటెస్ట్ ఫోటోలు, వీడియోలపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

తిరుమలలో కొండపై గుండు చేయించుకున్న తర్వాత కూతురు సుప్రితతో కలిసి అభిమానులతో ఫోటోలు దిగింది సురేఖవాణి. రీసెంట్ గా తన ఇంటికి చేరుకున్న తర్వాత గుండుతో షర్ట్ వేసుకొని కళ్ల జోడు పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. సురేఖవాణి గుండు ఫోటోలను చూసి నెటిజన్లు విపరీతంగా విమర్శిస్తున్నారు. క్యాన్సర్ వచ్చిందా అందుకే ఈ అవతారం అంటూ కామెంట్ పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు రాకేష్ మాస్టర్ లా ఉన్నావని ట్రోల్ చేస్తున్నారు.సురేఖవాణి గతంలో చాలా సినిమాల్లో వదిన, అక్క, అత్త వంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ కామెడీ పండించేది.

కాని భర్త చనిపోయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా గుండు చేయించుకున్న ఫోటోలపై భర్త చనిపోయినప్పుడే కూతురుతో కలిసి టూర్ లు తిరిగింది..ఇప్పుడేంటి ఇలా అని అవమానిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఇష్టమైన వ్యక్తుల కోసమే మీ జుట్టును త్యాగం చేసి ఉంటారని ఒక నెటిజన్ కామెంట్ పోస్ట్ చేస్తే..భర్త చనిపోతే తల్లి, కూతురు టూర్ లు తిరిగారు..వీళ్లా త్యాగం చేసేది అంటూ మరో నెటిజన్ ట్రోల్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *