సితార పాప సినీ అరంగేట్రం చేయకుండానే తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎప్పుడూ చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటుంది. తన తండ్రిలాగే పేద విద్యార్థులకు సాయం చేస్తుంది. అలాగే ఇన్ స్టాలో రీల్స్, డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది. ముఖ్యంగా మహేష్ పాటలకు సితార డాన్స్ అదరగొట్టేస్తుంది. అయితే మహేష్ డాటర్ సితార సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటారు.
తన డ్యాన్స్ వీడియోలో పెడుతూ పాపులారిటీ తెచ్చుకున్నారు. చాలా చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సితార ప్రముఖ జ్యుయలరీ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. దాని ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ సేవా కార్యక్రమాలకు వినియోగించినట్లు గతంలో చెప్పారు. సితారకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తను పెట్టే డ్యాన్స్ వీడియోలు చూసి అభిమానులు సంబరపడుతుంటారు.
గుంటూరు కారం సినిమా రిలీజైనప్పటి నుండి ఫుల్ జోష్‌లో ఉన్నారు సితార. కొద్దిరోజుల క్రితం ‘ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్’ అంటూ ఆ సినిమాలోని పాటకు స్టెప్పులు వేసారు. తాజాగా ‘దమ్ మసాలా’ అంటూ స్టెప్పులు ఇరగదీశారు. సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.