కీలక ఆధారాలు బయటపెట్టిన కళ్యాణ్ దిలీప్ సుంకర, రాజ్ తరుణ్ కు సూటి ప్రశ్నలు.

రాజ్ తరుణ్ తనని వాడుకొని మోసం చేశాడు అంటూ మొదటి నుంచి లావణ్య ఆరోపిస్తోంది. లావణ్య చేసిన ఫిర్యాదుకు ఆధారాలు సమర్పించాలి అని పోలీసులు లావణ్యకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు సమాధానంగా 170కి పైగా ఫొటోలు మెడికల్ రిపోర్టులు కూడా పోలీసులకు సమర్పించినట్లు లావణ్య చెప్పుకొచ్చాంది. తన పేరిట తిరుగుతున్న ఆడియోలు నిజం కాదని చెప్పుకొచ్చింది.

2023 సెప్టెంబర్ లో తనను రెచ్చగొట్టి కావాలనే అలా మాట్లాడేలా చేశాడని చెప్పింది. తాను మాత్రమే తిట్టిన మాటలను ఎడిట్ చేసినట్లు తెలిపింది. తాను కేవలం కోపం, బాధలో మాత్రమే అలా మాట్లాడినట్లు చెప్పింది. తనకు డ్రగ్స్ కేసుకు సంబంధం లేకపోయినా కూడా కావాలనే ఇరికించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రా బంధానికి సంబంధించి కూడా ఆధారాలు సమర్పించినట్లు వెల్లడించింది.

ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర రాజ్ తరుణ్ కు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. “మస్తాన్ సాయి- లావణ్య డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తావా? నీకు తెలిసిన ఆస్పత్రిలో బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేయించి డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపించగలవా? యూట్యూబ్ ఛానల్ కి లీగల్ నోటీసులు ఇస్తే.. అతనే తమ పీఆర్వోకి డబ్బులిచ్చి క్లిప్స్ ప్లే చేయమని ఒత్తిడి చేసినట్లు తెలిపారు. ఆ రికార్డింగులు కూడా పోలీసులకు వినిపించాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *