పూరీ ఆలయంలో రత్న భాండాగారం తెరిచాక ఎస్పీ కి ఏమైందో తెలుసా..?

పూరీలోని 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయానికి 46 ఏళ్ల తర్వాత ఒడిశా ప్రభుత్వం ఆదివారం ఓపెన్ చేసింది. ఖజానా, గృహ అమూల్యమైన ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులు, పవిత్రమైన ‘సుబా బేల’ (మంచి సమయం) సమయంలో మధ్యాహ్నం 1:28 గంటలకు అన్‌లాక్ అయ్యాయి.

అయితే యావత్ దేశం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. సుమారు 46 ఏళ్ల తర్వాత భాండాగారంలోని విలువైన నగలు, బంగారు ఆభరణాలను 11 మందితో కూడిన ప్రత్యేక బృందం బయటకు తీసుకొచ్చింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెట్టెల ద్వారా వాటిని వెలుపలకు తీసుకొచ్చామని ‘శ్రీ జగన్నాథ్ ఆలయం’ చీఫ్ అరబింద పధే ప్రకటించారు.

లోపలి ఛాంబర్ తెరిచే ఉంటుందని, పూర్తి ప్రక్రియను ముగించేందుకు తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. కాగా పొద్దుపోవడంతో నగల విలువ లెక్కింపును అధికారులు నిలిపివేశారు. అయితే ఎప్పుడు లెక్కిస్తారనేది తెలియాల్సి ఉంది. ఒడిశాలోని పూరీ క్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంది. ఆలయంలోని ఈ రహస్య గదిని తెరిచిన అనంతరం సిబ్బంది లోపలంతా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రత్న భాండాగారం సమీపంలో ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *