నేను చనిపోతే! నా పిల్లల పరిస్థితి ఏంటి..? ఏడ్చేసిన సుమ..!

సుమ మీడియాకు క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఓ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నాను. పూర్తీ వివరాలోకి వెళ్తే ఆదికేశవ సినిమాలో మూడో పాట అయిన లీలమ్మో పాట లాంచ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‍లోని ఓ హోటల్‍లో జరిగింది. ఈ కార్యక్రమానికి సుమ హోస్ట్ చేసింది. ఈ సందర్భంగా సుమ అన్న ఓ మాటపై ఓ జర్నలిస్టు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాము పెట్టిన స్నాక్స్‌ను ఎవరైతే భోజనంలా తింటున్నారో వాళ్లు తొందరగా లోపలికి వచ్చిన ఇక్కడ కెమెరాలను పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామని జర్నలిస్టులను ఉద్దేశించి సుమ అన్నారు. దీనిపై ఓ జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వాళ్ల విషయంలో సుమ లిమిట్స్‌లో ఉండాలని అన్నారు. సుమ చేసిన వ్యాఖ్యలు తమకు కోపం తెప్పించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ ఈవెంట్‍లో స్టార్ట్ చేసే ముందు.. స్నాక్స్ భోజనంలా చేస్తున్నారని మీరు మీడియా వాళ్లను అన్నారు చూశారా.. అది ఒకటి అనకుండా ఉండి ఉంటే బాగుండేది” అని ఆ జర్నలిస్టు అన్నారు. దీంతో జోక్‍గా తాను అన్నానని, అందరూ తనకు చాలా ఏళ్ల నుంచి తెలుసు కదా అని సుమ సమర్థించుకున్నారు.

“మీరు జోక్స్ బాగా చేస్తారు కానీ.. మీడియాను మినహాయిస్తే బాగుంటుందనిపిస్తోంది” అని ఆ జర్నలిస్టు అడిగారు. అయితే, “మీరు స్నాక్స్‌ను.. స్నాక్స్‌లాగే తిన్నారు.. ఓకేనా” అని సుమ అన్నారు. దీంతో ఆయనకు మళ్లీ కోపం వచ్చింది. “అదే వద్దనేది.. మీడియాను వద్దు.. జనరల్‍గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే కానీ.. మీడియా వరకు వద్దు ప్లీజ్” అని ఆ జర్నలిస్టు చెప్పారు. “మీకు బాధ కలిగించి ఉంటే చాలా సారీ. నా ఉద్దేశం అది కాదు” అని సుమ చెప్పారు. అయితే, తమకు బాధ కలిగిందని, కానీ ఓకే అని ఆ సదరు జర్నలిస్టు అనటంతో ఈ వాగ్వాదం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *